![]() |
![]() |
.webp)
ఇండస్ట్రీలో ఆలీ, పవన్ కళ్యాణ్ రిలేషన్ ఎంతో గొప్పదో అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ ప్రతీ మూవీలో ఆలీ ఉంటాడు. తనకు లైఫ్ ఇచ్చిందే పవన్ కళ్యాణ్ అని ఆలీ ఎన్నో సార్లు చెప్పాడు కూడా. అలాంటి ఆలీ తర్వాత కాలంలో పవన్ కళ్యాణ్ తో కలిసి ఏ మూవీలో కనిపించడం లేదు. ఇప్పుడు ఒక షోలో పవన్ కళ్యాణ్ మీద ఆలీ సంచలన వ్యాఖ్యలు చేసాడు. అంతే కాదు అల్లు అర్జున్ సాంగ్ కి స్టెప్పులు కూడా వేసాడు. సుమ అడ్డా షో ప్రోమోలో ఈ సీన్స్ కనిపిస్తాయి. ఈ షోకి సౌమ్య రావు, సిరి హన్మంత్, ఆలీ, శ్రీహన్ వచ్చారు. ఇక రాగానే సుమ అందరికీ వైన్ ఇచ్చి మరీ ఇన్వైట్ చేసింది. ఐతే సుమ శ్రీహన్ ని, ఆలీని ఒక గదిలో కూర్చోబెట్టి "మీకు పాటలు వచ్చా" అని అడిగింది.
.webp)
దానికి ఆలీ 'ఓ అంటావా మావా" సాంగ్ పాడాడు. ఇక సుమ ఆ పాటను తనకు నచ్చినట్టు కన్వర్ట్ చేసుకుంది. ఆ పాటకు అందరూ కలిసి స్టెప్పులేశారు. ఇక తరువాత ఆలీని ఒక ప్రశ్న అడిగింది సుమ. "ఆన్-స్క్రీన్ మీద మీరు వర్క్ చేసిన హీరోల్లో బెస్ట్ కాంబినేషన్ ఎవరితో అని చెప్తారు. రవితేజ - ఆలీ, పవన్ కళ్యాణ్- ఆలీ " అని అడిగింది. దానికి ఆలీ పవన్ కళ్యాణ్ తో బెస్ట్ కాంబినేషన్ అని చెప్పాడు. ఆ మాటకు బ్యాక్ స్క్రీన్ మీద పిఠాపురం ఎంఎల్ఏ గారి తాలూకా ఫోటో మంచి ఫైర్ తో ప్లే అయ్యేసరికి అందరూ ఎంజాయ్ చేశారు. ఇక నెటిజన్స్ ఐతే ఆలీ ఇచ్చిన ఆన్సర్ కి మండిపోతున్నారు. "కావాలనే పవన్ కళ్యాణ్ పేరు చెప్పాడు ఆలీ, ఇప్పుడు తెలిసిందా మీకు పవన్ కళ్యాణ్ వేల్యూ" అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
![]() |
![]() |